- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023 : నేడే ఐపీఎల్ ఫైనల్.. అందరి దృష్టి ఆ ఇద్దరి పైనే?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ -16 సీజన్ చివరి అంకానికి చేరింది. గ్రూప్ దశలో తమ ఆటతీరుతో సత్తా చాటిన రెండు ప్రధాన జట్లు ఆదివారం టైటిల్ వార్ లో ఢీకొననున్నాయి. నాలుగు సార్లు ఛాంపియన్ చెన్నై, సీజన్‌లో అరంగేట్రంతోనే కప్ అందుకున్న గుజరాత్ నేడు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి మహేంద్ర సింగ్ ధోని, గుజరాత్ ఆటగాడు శుభ్ మన్ గిల్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. 16 మ్యాచ్‌ల్లో 851 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే బ్యాటింగ్ లో చెన్నై, బౌలింగ్ లో గుజరాత్ పై చేయిలో ఉన్నాయి.
42వ పుట్టిన రోజుకు దగ్గరలో ఉన్న మహీ ఐపీఎల్‌లో కొనసాగడంపై కూడా ఈ సీజన్ లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ధోని రిటైర్ మెంట్ ప్రకటిస్తే ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ -16 విజేత జట్టుకు రూ.20కోట్లు, రన్నరప్ కు రూ.13 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నారు. మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు దక్కనున్నాయి. ఈ సీజన్ లో టాప్ -3 బౌలర్లలో గుజరాత్ ఆటగాళ్లే ఉండటం విశేషం. షమి(28), రషీద్(27), మోహిత్ (24) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ధోని ఆడే 11వ ఐపీఎల్ ఫైనల్ ఇది కావడం మరో స్పెషాలిటీ. ఇన్ని సార్లు ఐపీఎల్ ఫైనల్ లో ఆడిన కూడా అతనే కావడం విశేషం.