- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
IPL 2023: ముంబై బౌలర్ చెత్త రికార్డు..

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పియూష్ చావ్లా.. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఇతర బౌలర్ ఇన్ని సిక్సర్లు ఇవ్వలేదు. క్యాష్ రిచ్ లీగ్‌లో 170 మ్యాచ్‌లు ఆడిగా.. రికార్డు స్థాయిలో 185 సిక్సర్లు సమర్పించుకున్నాడు.
అయితే చావ్లా తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ 182 సిక్సర్లు, సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (180), లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా (176), రాజస్థాన్ ఆల్‌రౌండర్ అశ్విన్ (173) అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న వారిలో ఉన్నారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.