- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: టాస్ గెలిచిన RCB.. ఢిల్లీ స్టార్ బౌలర్ దూరం

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ ఢిల్లీ, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, మరి కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే దూరమయ్యాడు. వ్యక్తిగత పనుల కారణంగా అతడు దక్షిణాఫ్రికా వెళ్లడంతో నోర్జే ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు ఢిల్లీ ఫ్రాంచైజ్ తెలిపింది. కీలక మ్యాచ్‌కు స్టార్ బౌలర్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగుతోంది.
జట్ల వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(c), ఫిలిప్ సాల్ట్(w), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్