- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: రోహిత్ శర్మ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో బ్యాటర్‌గా..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ వర్మ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఆరువేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహత్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ మార్క్ చేరుకోవడానికి రోహిత్‌కు 226 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ (186 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్ (199 ఇన్నింగ్స్‌లు), డేవిడ్ వార్నర్ (165 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లీ 6844 పరుగులు (228 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ 6,477 పరుగులు (210 మ్యాచ్‌లు) రెండో స్థానంలో, డేవిడ్ వార్నర్ 6109 పరుగులు (167 మ్యాచ్‌లు) మూడో స్థానంలో, రోహిత్ శర్మ 6014 పరుగులు (232 మ్యాచ్‌లు) ఉన్నారు.
Milestone 🚨 - 6000 runs and counting for @ImRo45 in #TATAIPL
— IndianPremierLeague (@IPL) April 18, 2023
Keep going, Hitman 💪💪#SRHvMI pic.twitter.com/VQeYRWivwb