IPL 2023: నేడు ఆర్సీబీ vs కేకేఆర్ ఢీ.. బెంగళూరు ముందు కోల్‌కతా నిలిచేనా..?

by Vinod kumar |   ( Updated:2023-04-05 18:45:46.0  )
IPL 2023: నేడు ఆర్సీబీ vs కేకేఆర్ ఢీ.. బెంగళూరు ముందు కోల్‌కతా నిలిచేనా..?
X

కోల్‌కతా: ఐపీఎల్-16‌లో బోణీ కొట్టని జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో ముంబైకి షాకిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లీగ్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ రెండు జట్లు నేడు కోల్‌కతా వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని కేకేఆర్ భావిస్తుండగా.. ముంబైపై విజయంతో బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉన్నది. సొంత మైదానం కావడం కోల్‌కతాకు కలిసిరానుంది.

అయితే, ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలకడగా ఆడాల్సిన అవసరం ఉన్నది. శ్రేయస్ అయ్యర్ దూరం కావడంలో కేకేఆర్‌ను ఏ విధంగా నష్టపరిచిందో తొలి మ్యాచ్‌లో చూశాం. మిడిలార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా పర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయారు. షకీబ్ అల్ హసన్‌ స్థానంలో జేసర్ రాయ్ చేరడం బ్యాటింగ్ దళాన్ని బలాన్ని పెంచేదే అయినప్పటికీ.. అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా, ఆండ్రీ రస్సెల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉన్నది.

అలాగే, బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు, బెంగళూరు ప్రధాన బలం కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్. మొదటి మ్యాచ్‌లో ముంబై వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే, వీరిద్దరూ విఫలమైతే జట్టు కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది. తొలి మ్యాచ్‌‌లో దినేశ్ కార్తీక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్లే జట్టును విజయానికి దగ్గరగా చేర్చడంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం దక్కలేదు. నేటి మ్యాచ్‌లో వీరిద్దరూ ఏ విధంగా రాణిస్తారో చూడాలి. ఒకవేళ టాప్-4 విఫలమైతే జట్టు యువ క్రికెటర్లు మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాద్ అహ్మద్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, ఆర్సీబీ బౌలింగ్ దళంగా మాత్రం పటిష్టంగా ఉన్నది. సిరాజ్, టోప్లీ, కర్ణ్ శర్మ ఫామ్‌లో ఉండగా.. హర్ష్ పటేల్ పుంజుకోవాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed