- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఫలితంగా బ్రేవో, లసిత్ మలింగ లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు. 296 టీ20లో జడేజా 30.25 సగటుతో 200 వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 16 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ఫలితంగా ఐపీఎల్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన 11వ బౌలర్‌గా నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డ్వేన్ బ్రేవో పేరిట ఉంది(183). అతడి తర్వాత చాహల్ 176 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. లసిత్ మలింగ 170 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత అమిత్ మిశ్రా(169), రవిచంద్రన్ అశ్విన్(163) వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో బ్రేవో 615 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ 536 వికెట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 484 వికెట్లతో మూడో స్థానంలో, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 469 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. బంగ్లా బౌలర్ షకిబుల్ హసన్ 451 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.