IPL 2023: ఐపీఎల్‌ విజేత ఎవరో చెప్పేసిన టీమ్ ఇండియా మాజీ లెజెండ్..!

by Vinod kumar |
IPL 2023: ఐపీఎల్‌ విజేత ఎవరో చెప్పేసిన టీమ్ ఇండియా మాజీ లెజెండ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌ సెకెండ్ హాఫ్.. రసవత్తరంగా సాగుతోంది. స్టేడియాల్లో పరుగుల వరద పారుతోంది. భారీ లక్ష్యాలు సైతం గల్లంతవుతున్నాయి. 200లకు పైగా చేసిన టార్గెట్ కూడా గెలుపుపై గ్యారెంటీ ఇవ్వట్లేదు. 200లకు పైగా పరుగులు చేసిన జట్లు కూడా పరాజయాన్ని చవి చూస్తోన్నాయంటే ఈ సీజన్‌లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తివడంతోపాటుగా ప్లేఆఫ్‌కు ఏ జట్లు వస్తాయని, ఏ జట్టు విజేతగా నిలుస్తుందో అని పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే నుండే ఓ అంచనాకు వస్తున్నారు. టీమ్ ఇండియా మాజీ లెజెండ్ రవిశాస్త్రి ఈ సీజన్ విజేత ఎవరో జోస్యం చేప్పాడు.

గుజరాత్‌ టైటాన్స్‌ మరోసారి విజేతగా నిలుస్తుందన్నాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే గుజరాత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు విజయాల కోసం సమష్టిగా రాణిస్తుండటం చూస్తుంటే.. ఈ సారి కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా గుజరాతే నిలుస్తోందని రవిశాస్త్రి విశ్లేషించారు. ఈ సీజన్‌లో గుజరాత్‌ 6 విజయాలతో తొలి స్థానంలో ఉండగా.. లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story