- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: నేడు ముంబైతో గుజరాత్ టైటాన్స్ ఢీ..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ముంబైతో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతున్నది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు కనబర్చి.. పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన ముంబై.. మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.
మరోవైపు అసాధారణ ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించిన గుజరాత్ టైటాన్స్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సమష్టిగా రాణించడం గుజరాత్ ప్రధాన బలం కాగా.. సొంత మైదానంలో ఆడుతుండటం కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు పియూష్ చావ్లా, హృతిక్ షోకీన్‌లు మాత్రమే కట్టడిగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయడంపై రోహిత్ సేన ఫోకస్ పెట్టింది.
ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమైన ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా సెట్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు కూడా ఇప్పటికే ఫామ్ అందుకున్నారు. తిలక్ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండగా.. గ్రీన్ సైతం టచ్‌లోకి వచ్చాడు. బ్యాటింగ్ బలహీనతలు అధిగమించినా.. ముంబైని డెత్ ఓవర్ల బలహీనత వేధిస్తోంది. జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లోకి వస్తే ఈ సమస్య కూడా తీరనుంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్/అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రాండార్ఫ్/రిలే మెరిడిత్.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు(అంచనా):
వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ