IPL 2023: స్టోయినిస్‌ సంచలన ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్‌ ఇదే

by Vinod kumar |
IPL 2023: స్టోయినిస్‌ సంచలన ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్‌ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ (47 బంతుల్లో 89 నాటౌట్‌, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడగా.. కృనాల్‌ పాండ్యా 49 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌, స్టోయినిస్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ముంబై బౌలర్‌లో.. బెహండార్ఫ్‌ 2 వికెట్లు తీయగా.. పియూష్‌ చావ్లా ఒక వికెట్‌ తీశాడు.

Advertisement

Next Story