IPL 2023: ఐపీఎల్‌లో జేసన్ రాయ్ ఎంట్రీ..

by Vinod kumar |
IPL 2023: ఐపీఎల్‌లో జేసన్ రాయ్ ఎంట్రీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కేకేఆర్ ప్లేయర్ షకీబుల్ హసన్ ఈ సీజన్ మొత్తానికీ దూరమైన విషయం తెలిసిందే. షకీబల్ హసన్‌ ఐపీఎల్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. ఆదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడేందుకు హసన్‌కు అనుమతి నిరాకరించింది.

దీంతో షకీబల్ హసన్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను జట్టులోకి తీసుకుంది. 2.8 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఐపీఎల్ వేలం పాటలో జేసన్ రాయ్ బేస్ ప్రైజ్ 1.5 కోట్ల రూపాయలు. దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించి జేసన్‌ రాయ్‌ను జట్టులోకి తీసుకుంది.

Advertisement
Next Story