IPL 2023: ధోనీని ద్వేషించాలంటే.. హార్దిక్​ పాండ్య ఆసక్తికర ​కామెంట్స్

by Vinod kumar |
IPL 2023: ధోనీని ద్వేషించాలంటే.. హార్దిక్​ పాండ్య ఆసక్తికర ​కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ప్లే ఆఫ్‌లో చెన్నైతో గుజరాత్‌ జట్టు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి పెద్ద అభిమానినని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ధోనీపై ప్రశంసల జల్లును కురిపించాడు. తాను ఎప్పుడూ ధోనీ అభిమానినేనని.. క్వాలిఫయర్​ మ్యాచ్‌ నేపథ్యంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్య.. ధోనీ గురించి మాట్లాడాడు. ఈ వీడియోను "కెప్టెన్‌.. లీడర్‌.. లెజెండ్‌.. ఎంఎస్‌ ధోనీ ఓ ఎమోషన్‌" అంటూ గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ స్పెషల్‌ వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

"చాలా మంది ధోనీ ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడని అనుకుంటారు. నేనైతే ధోనీతో చాలా సరదాగా ఉంటాను. జోక్‌లు కూడా వేస్తాను. నిజంగా నేను అతని దగ్గర నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. నాకైతే మహీ బెస్ట్‌ ఫ్రెండ్‌, ఓ ప్రియమైన సోదరుడు. అతడితో చిలిపి పనులు చేసేవాడిని. ఇక నేనెప్పుడూ ధోనీ అభిమానినే. అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని ఎవరైనా ద్వేషించాలంటే.. వారు చాలా క్రూరులై ఉండాలి" అంటూ సరదాగా స్పందించాడు.

Advertisement

Next Story