IPL 2023 Final: ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహణపై కీలక ప్రకటన..

by Vinod kumar |
IPL 2023 Final: ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహణపై కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై మధ్య ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. చెన్నై ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం చెన్నై వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. అయితే స్టేడియం వద్ద వర్షం ఆగిపోయింది. కానీ పిచ్‌తో పాటు గ్రౌండ్‌లో నీరు నిలిచింది. సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. దీంతో మ్యాచ్ ప్రారంభానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ప్రారంభంపై రాత్రి 10:45 గంటలకు ప్రకటన చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story