IPL 2023 Final: 'రిజర్వ్ డేలో మ్యాచ్ అంటే.. ధోనీ రిటైర్‌మెంట్ పక్కానా'.. ఫ్యాన్స్ ఎమోషనల్

by Vinod kumar |
IPL 2023 Final: రిజర్వ్ డేలో మ్యాచ్ అంటే.. ధోనీ రిటైర్‌మెంట్ పక్కానా.. ఫ్యాన్స్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగాల్సిన IPL 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కురవడంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రిజర్వ్ డేలో జరుగుతుండటంతో ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అని కొందరు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. "రిజర్వ్ డేలో మ్యాచ్ జరిగిందంటే.. అది ధోనీకి చివరి మ్యాచ్ అయి ఉంటుందని కొందరు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కాగా, ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందే తెలుగు స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు తను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. మళ్లీ యూటర్న్ తీసుకోనని చెప్పాడు. మరి రిజర్వ్ డేలో మ్యాచ్ ముగిశాక ధోనీ కూడా ఇలాగే బాంబు పేలుస్తాడని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు".



Next Story