IPL 2023: కోచ్‌లు డగౌట్‌లో ఉండాలి.. గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

by Vinod kumar |
IPL 2023: కోచ్‌లు డగౌట్‌లో ఉండాలి.. గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఫైర్ అయ్యారు. లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్, గంభీర్‌ల మధ్య గొడవపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య గొడవ అయిన విషయం తెలిసిందే. కోచ్‌లు డగౌట్‌లో ఉండాలని.. స్టేడియంలోకి రావాల్సిన అవసరం ఏం ఉందన్నారు. ఈ ఘటనలో.. ఆటగాళ్ల మధ్య వివాదం తలెత్తితే కోచ్‌లు మధ్యలో దూరిపోవాల్సిన అవసరం లేదంటూ గంభీర్ తీరును తప్పబట్టాడు.

"మైదానంలో ఆటగాళ్లు ఒక్కోసారి గొడవ పడటం సహజం. ఆటలో భావోద్వేగాలు కూడా మిళితమై ఉంటాయి. అలా అని ప్రతీ రోజు ఇలాంటి వివాదాలు జరగవు కదా? ఏదేమైనా ఇలాంటివి జరిగినప్పుడు కోచ్‌లు సంయమనం పాటించాలి. కోచ్‌లు లేదంటే ఇతర సహాయ సిబ్బంది ఆటలో ఎందుకు జోక్యం చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు" అని మైఖేల్ వాన్ అన్నారు. "ఒకవేళ ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంటే.. వాళ్లే కాసేపటి తర్వాత సర్దుకుంటారు. అంతేగానీ డగౌట్‌లో కూర్చోవాల్సిన కోచ్‌లు వెళ్లి మధ్యలో దూరిపోకూడదు. డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి గమనిస్తూ పరిస్థితిని గమనించి అందుకు తగ్గట్లు గొడవ చల్లారేలా చేయాలి" అని మైఖేల్ వాన్ వ్యాఖ్యానించాడు.

Advertisement

Next Story

Most Viewed