IPL 2023: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ అరుదైన రికార్డ్..

by Vinod kumar |
IPL 2023: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ అరుదైన రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సర్‌రైజర్స్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్‌ చేసిన రెండో బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫిల్‌ సాల్ట్‌ను డకౌట్‌ చేసిన భువీ.. ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ఇప్పటివరకు భువీ 25 మంది బ్యాటర్లను డకౌట్‌ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగా(36) తొలి స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed