మ్యాచ్కు కొన్ని గంటల ముందు పంత్ ఎమోషనల్ ట్వీట్

by Javid Pasha |
మ్యాచ్కు కొన్ని గంటల ముందు పంత్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 సీజన్ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ను గుజరాత్ టైటాన్స్ చిత్తు చేసింది. కాగా ఇవాళ రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జియంట్స్ మధ్య రసవత్తర పోటీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో ఎవరెవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు అంటూ ఆ జట్టు యాజమాన్యం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.

కాగా ఇంకా కొన్ని గంటలైతే మ్యాచ్ ప్రారంభం కానున్న క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ కు ఆ జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. ‘‘తుది జట్టులో నేను 13 ప్లేయర్ ను.. ఇంపాక్ట్ రూల్ లేకుంటే నేను 12వ ప్లేయర్ గా ఉండేవాడిని’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు గత సీజన్ లో కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ కు 2022 డిసెంబర్ లో యాక్సిడెంట్ అయింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్.. ఈ సీజన్ లో డీసీ తరఫున ఆడటం లేదు. అయితే ఓ ఆటగాడిగా కాక ఓ మెంటర్ గా ఢిల్లీ జట్టుకు పంత్ సేవలు అందించనున్నారు.

ఇదే విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యాం శర్మ చెప్పారు. "పంత్ కు అభ్యంతరం లేకపోతే ఢిల్లీలో జరిగే మ్యాచులకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంటి నుంచి తీసుకురావడం... తీసుకుపోవడం వంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆయన కోసం ఓ స్పెషల్ ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేస్తాం" అని ఆయన తెలిపారు. ఇక జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. “ఢిల్లీ క్యాపిటల్స్ కు సంబంధించి ప్రతి మ్యాచ్ కు పంత్ ఉండాలని కోరుకుంటున్నాం. డ్రెస్సింగ్ రూమ్ లో.. డగౌట్ లో పంత్ సేవలు వినియోగించుకుంటాం. ఆయన జట్టుతో ఉంటే సభ్యులకు ధైర్యంగా ఉంటుంది" అని అన్నారు.


Advertisement

Next Story