ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ నమోదు

by Shiva |
ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 ఎడిషన్ లో ఫాస్టెస్ట్ డెలివరీ నమోదైంది. కోల్ కత్త నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ రికార్డును నెలకొల్పాడు. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఆడుతున్న ఫెర్గూసన్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అత్యంత వేగవంతమైన డెలివరీని సంధించాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 150 ప్లస్ స్పీడ్ వేసిన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఒకే ఒక్కడు కావడం విశేషం.

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా జమ్మూ కుర్రాడు 152 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఫెర్గూసన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. గుజరాత్ తో మ్యాచ్ లో ఫెర్గూసన్ నాలుగో ఓవర్లో 154 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. ఈ బాల్ ను శుభ్‌మన్ గిల్ బ్యాక్‌ వర్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డెలివరీ నమోదు చేసిన బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక రాబోయే రోజుల్లో ఉమ్రాన్ - ఫెర్గూసన్ మధ్య మళ్లీ స్పీడ్ వార్ మొదలవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed