గుజరాత్ టాప్ లేపిన చెన్నై.. 2023 ఐపీఎల్ ఫైనల్ చేరిన మొదటి జట్టు

by Mahesh |
గుజరాత్ టాప్ లేపిన చెన్నై.. 2023 ఐపీఎల్ ఫైనల్ చేరిన మొదటి జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బాగంగా.. జరిగిన మొదటి క్యాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ పై చెన్నై మొట్టమొదటిసారి గెలిచి ఫైనల్ చేరుకుంది. మొదట టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. చెన్నై బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో గైక్వాడ్ 60, కాన్వే 40, జడేజా 22, రాణించడంతో 7 వికెట్ల నష్టానికి చెన్నూ 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.

గిల్ మినహా టాప్, మిడిల్ ఆర్డర్ లో ఎవరూ సరిగ్గా రాణించకపోవడంతో గుజరాత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. చివర్లో రషీద్ ఖాన్ 16 బంతుల్లో 30 పరుగులతో మ్యాచ్ గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ 19వ ఓవర్లో అవుట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లకు గుజరాత్ కేవలం 157 పరుగులు చేయడంతో ఓటమి పాలైంది. మొదటి క్యాలీఫయర్ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన ధోని సేనా.. డైరెక్టుగా ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్ లో 60 పరుగులతో రాణించిన గైక్వాడ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Advertisement

Next Story