CSK Vs GT: సెంచరీలతో కదంతొక్కిన గిల్, సాయి సుదర్శన్.. చెన్నై విజయ లక్ష్యం ఎంతంటే?

by Disha Web Desk 1 |
CSK Vs GT: సెంచరీలతో కదంతొక్కిన గిల్, సాయి సుదర్శన్.. చెన్నై విజయ లక్ష్యం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024 ఎడిషన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో కదంతొక్కారు. ఏకంగా ఐపీఎల్ చరిత్రలో క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ నెలకొల్పిన 210 పరుగులు ఒపెనింగ్ రికార్డు భాగస్వామ్యాన్ని శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సమం చేశారు. వారిద్దరినీ కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లు ఘోరంగా విఫలయ్యారు. చూడచక్కని షాట్లతో 9 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 51 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఒక చెన్నై బౌలర్లో విషయానికొస్తే.. తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లను నేలకూల్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ 2 వికెట్లను కోల్పోయి 231 పరుగులు చేసింది. అయితే, ఆ లక్ష్యాన్ని చెన్నై చేధించి ప్లే ఆఫ్ రేసులో ఉంటుందా.. లేక చేతులెత్తేస్తుందా వేచి చూడాల్సిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed