IPL 2023: స్టేడియంలో గురు శిష్యుల సరదా ముచ్చట్లు.. ధోనిని హత్తుకున్న ఫొటో షేర్‌ చేసిన కోహ్లీ..

by Vinod kumar |
IPL 2023: స్టేడియంలో గురు శిష్యుల సరదా ముచ్చట్లు.. ధోనిని హత్తుకున్న ఫొటో షేర్‌ చేసిన కోహ్లీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం.. ధోనీ, విరాట్ కోహ్లీ ముచ్చటించిన వీడియో వైరల్‌గా మారింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో సీఎస్‌కే చేతిలో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ సందర్భంగా ధోనిని కలిసిన కోహ్లి అతడితో సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌.. ‘‘ఇద్దరు దిగ్గజాలు’’ అంటూ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇక ఈ టీమిండియా మాజీ సారథుల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మిస్టర్‌ కూల్‌ ధోని అంటే కోహ్లికి మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఇక తాజాగా మరోసారి ధోనిపై ప్రేమను కురిపిస్తూ కోహ్లీ షేర్‌ చేసిన ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను విరాట్‌ కోహ్లి మ్యాచ్‌ అనంతరం తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘తలాకు బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌బాయ్‌’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story