అగార్కర్ భాయ్.. దయచేసి అతన్ని ఎంపిక చేయండి : సురేశ్ రైనా

by Harish |
అగార్కర్ భాయ్.. దయచేసి అతన్ని ఎంపిక చేయండి : సురేశ్ రైనా
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ బ్యాటర్ శివమ్ దూబె ఐపీఎల్-17లో అదరగొడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయని అతను ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అలవోకగా సిక్స్‌లు కొట్టేస్తున్నాడు. దీంతో త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు అతన్ని ఎంపిక చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది.

మరో వారం రోజుల్లో బీసీసీఐ ప్రపంచకప్ జట్టును ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సెలెక్టర్లు ఆ దిశగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఓ అభ్యర్థన చేశాడు. శివమ్ దూబెను టీ20 ప్రపంచకప్ ఎంపిక చేయాలని కోరాడు. ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టిన రైనా..‘దూబె కోసం వరల్డ్ కప్ సిద్ధమవుతుంది. అజిత్ అగార్కర్ భాయ్ అతన్ని ఎంపిక చేయండి. ప్లీజ్.’ అని రాసుకొచ్చాడు.

మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ దూబె మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 27 మ్యాచ్‌ల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో చెన్నయ్ తరపున 1,000 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతను 169.94 స్ట్రైక్ రేటుతో 311 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అతను 6వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story