రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ప్రకటన?

by Gantepaka Srikanth |
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ప్రకటన?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy-2025) అనంతరం వన్డే ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్(Ajit Agarkar), హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)తో ఇప్పటికే తన నిర్ణయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో వచ్చే వన్డే ప్రపంచకప్ సమయానికి టీమిండియా మరో సారథిని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యిందట. ఫిట్ నెస్ అనుకూలించినంత కాలం రోహిత్ జట్టుకు ఆడతాడని.. అందుకు బీసీసీఐ(BCCI) వర్గాలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలుస్తున్నది.

ఇక వన్డేల్లో 272 మ్యాచులు ఆడిన రోహిత్(Rohit Sharma).. 11092 పరుగులు చేశారు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌లో 1037 ఫోర్లు కొట్టగా, 341 సిక్లర్లు బాది.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు.. ఇప్పటికే టీ20ల్లో కెపెన్సీ వదిలేయడంతో పాటు ఆ ఫార్మాట్‌(ODI Format)కు రిటైర్మెంట్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై చెబుతాడనే వార్తలు ఆయన ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.



Next Story

Most Viewed