రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ వీడియో రిలీజ్ చేసిన BCCI

by Gantepaka Srikanth |
రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ వీడియో రిలీజ్ చేసిన BCCI
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. తొమ్మిది నెలల వ్యవధిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించడంతో ఆయనకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. ఇటీవల సాధించిన టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024), నిన్న సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లతో దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా ఎదుట.. ఐసీసీ చీఫ్ జై షా(Jay Shah)తో కలిసి రోహిత్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

కాగా, 2024 జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌లు ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా(Team India) సాధించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ నేతృత్వంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని సైతం భారత్ కైవసం చేసుకున్నది. దీంతో ఒక నాయకుడిగా జట్టును సమర్థవంతంగా నడిపించారని రోహిత్‌ను అంతా అభినందిస్తున్నారు. మరోవైపు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడారు. 83 బంతుల్లో 76 పరుగులు చేశారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో పాటు తన ఇన్నింగ్స్‌తో మిగతా ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడిలేకుండా చేశాడు.



Next Story

Most Viewed