టీ20 ప్రపంచకప్‌కు దినేశ్ కార్తీక్ ఎంపిక.. ఆ ముగ్గురు కూడా

by Harish |
టీ20 ప్రపంచకప్‌కు దినేశ్ కార్తీక్ ఎంపిక.. ఆ ముగ్గురు కూడా
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు. కొంతకాలంగా అతను వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్‌కు ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఐపీఎల్‌‌-17 రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన దినేశ్ కార్తీక్ ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, పొట్టి వరల్డ్ కప్‌లో అతను తన వ్యాఖ్యానంతో అలరించనున్నాడు.

ఐసీసీ శుక్రవారం 40 మందితో కూడిన టీ20 వరల్డ్ కప్‌ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. అందులో దినేశ్ కార్తీక్‌కు చోటు దక్కింది. అతనితోపాటు భారత్ నుంచి భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్‌లతోపాటు ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లేలు ఉన్నారు. అలాగే, టీ20 వరల్డ్ కప్ విజేతలు స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, వన్డే వరల్డ్ కప్ విజేతలు రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, ఇయాన్ మోర్గాన్, రమీజ్ రాజా, టామ్ మూడీ, వసీమ్ అక్రమ్‌లతోపాటు పలువురు కామెంటేటర్లుగా సందడి చేయనున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్ ఒబ్రియన్ వరల్డ్ కప్‌లో కామెంటేటర్‌గా అరంగేట్రం చేయనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed