రాఖీ పండుగకు వెళ్తూ అనంతలోకాలకు.. చెల్లెలి ఎదుటే అన్న మృతి

by Aamani |
రాఖీ పండుగకు వెళ్తూ అనంతలోకాలకు.. చెల్లెలి ఎదుటే అన్న మృతి
X

దిశ,నవీపేట్ : అన్న చెల్లెలు అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను చెల్లి ఇంట్లో జరుపుకుందామని చెల్లితో కలిసి బయలు దేరిన అన్న ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మరణించాడు. తెల్లవారితే అన్న కి రాఖీ కట్టాల్సిన చెల్లి అన్న చితిపై మట్టిని వేయడం చెల్లికి తీరని దుఃఖం మిగిల్చింది. బోధన్ లోని ఆటో నగర్ కు చెందిన బాలాజీ (33) చెల్లెలు పూజ మేన కోడలుతో కలిసి చెల్లెలు అత్తారిల్లు నాందేడ్ కు ఆదివారం ఉదయం పర్బని ప్యాసింజర్ రైల్ లో బయలుదేరారు. ముగ్గురు కలిసి టిఫిన్ చేసి చేతులు కడుక్కోవడానికి రైల్ లో వాష్ బేసిన్ వద్దకు బాలాజీ వెళ్ళగా ప్రమాదవశాత్తు రైలు కదలిక సమయంలో ఒక్కసారిగా జట్కా ఇవ్వడంతో నవీపేట్ మండలం లోని ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జారి కిందపడి గాయాలు అయ్యాయి.

లోకో పైలట్ రైలును నిలిపి గాయపడిన బాలాజీని బాసర స్టేషన్ కు తీసుకురాగా, అక్కడే ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రాఖీ పౌర్ణమి కి ఒక్కరోజు ముందు అన్న చనిపోవడంతో అక్కడివారిని కంటతడి పెట్టించింది. బాలాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామ అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర హాస్పిటల్ కు తరలించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్. ఐ. సాయి రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed