చింత పండు, యూరియా బస్టాల మధ్య గంజాయి రవాణా

by Disha Web Desk 15 |
చింత పండు, యూరియా బస్టాల మధ్య గంజాయి రవాణా
X

దిశ, హన్మకొండ : చింత పండు, యూరియా బస్టాల మధ్య గంజాయి రవాణాకు పాల్పడుతున్న నలుగురు గంజాయి ముఠా సభ్యులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రెండు లక్షల 35 వేల రూపాయల విలువైన 9 కిలోల 500 గ్రాముల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లు, చింత పండు బస్టాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులైన ఈదర కృష్ణ నాగేశ్వరరావు, ఆనుమొలు వెంకట రమణ ఇరువురు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సీలేరులో ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి దానిని ఎవరికీ అనుమానం రాకుండా చింత పండు, యూరియా బస్టాల నడుమ

రహస్యంగా భద్రపరిచి హన్మకొండలో పరిచయం ఉన్న మహ్మద్ అబ్దుల్ రహీమ్, శ్రీకర్ త్రిపాతిలకు అందజేసేందుకు హన్మకొండ బస్టాండ్ కు చేరుకున్నారు. బస్టాండ్ పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బస్ లో వచ్చిన ఇద్దరు నిందితులు, స్థానికంగా ఉన్న నిందితులకు చింతపండు బస్టాల్లో భద్రపర్చిన గంజాయిని విక్రయించే క్రమంలో హనుకొండ ఎస్ఐ శ్రవణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిందితులు గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా తెలిపారు. వారి వద్ద ఉన్న గంజాయి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి స్మగ్లర్ల ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Next Story