- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
విషాదం..విష జ్వరంతో టెన్త్ క్లాస్ విద్యార్థిని..

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ ఆశ్రమం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మహేశ్వరి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహేశ్వరిని పాఠశాలలో ఎవరు పట్టించుకోకపోవడంతోనే ఆమె మృతి చెందినట్లు ఆదివాసి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరి జ్వరంతో బాధపడుతుందన్న విషయం తెలుసుకున్న తండ్రి మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో మహేశ్వరి తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేశ్వరి మృతికి కారణమైన, నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. మహేశ్వరి మృతికి కారణమైన అధికారులతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, వార్డెన్‌లను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ..
ఆదివాసీ విద్యార్థిని మృతికి అధికారుల నిర్లక్ష్యం కారణమన్నారు. సంబంధిత అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహేశ్వరి మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతేడాది ఒక విద్యార్థిని విషజ్వరంతో చనిపోయిన ఘటన మరువక ముందే అదే పాఠశాలలో మరొక విద్యార్థిని విషజ్వరంతో మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ బిడ్డలను విష జ్వరం ప్రాణాలు తీస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిపై ఐటిడిఎపిఓ, డిడి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు కనీసం ఏఎన్ఎం ను నియమించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.