రెవెన్యూ అధికారుల నిర్వాకం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

by GSrikanth |
రెవెన్యూ అధికారుల నిర్వాకం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కుమార్తె సహా దంపతులు పద్మావతి, సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక తహశీల్దార్, రెవెన్యూ అధికారులే తమ సూసైడ్‌కు కారణమని లెటర్ రాసి మరీ దారుణానానికి పాల్పడ్డారు. తమకు చెందిన పదెకరాల భూమిని వేరే వారి పేరు మీదకు మార్చారని ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులకు కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story

Most Viewed