ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.. బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్ కన్నీళ్లు

by GSrikanth |
ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.. బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్ కన్నీళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గంజాయి కేసు వ్యవహారం గతకొన్ని రోజులుగా దుమారం రేపుతోంది. ఒక కేసులో షణ్ముక్ సోదరుడ్ని అరెస్ట్ చేయడానికి పోయిన పోలీసులకు గంజాయితో జశ్వంత్ అడ్డంగా దొరికి పోవడం కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న షణ్ముక్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను డిప్రెషన్‌లో ఉన్నాను. ఒక్కోసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్ తీసుకున్నానంటూ పోలీసుల సమక్షంలో షణ్ముక్ కన్నీళ్లు పెట్టారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల షణ్ముక్ సోదరుడు సంపత్ వినయ్ కోసం హైదరాబాద్ నార్సింగి పోలీసులు షణ్ముక్ ఇంటికి వెళ్లగా.. అక్కడ గంజాయి, డగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనను ప్రేమ, పెళ్లి పేరుతో సంపత్ వినయ్ వాడుకొని మోసం చేయటమే కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వైజాగ్‌కు చెందిన డాక్టర్ మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షణ్ముక్ ఫ్లాట్‌కు వెళ్లగా అనుకోని విధంగా అన్నదమ్ములు గంజాయితో పట్టుపడినట్లు తెలిసింది.

Advertisement

Next Story