Kidnap: అబిడ్స్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఆచూకీ ఎక్కడ లభించిందంటే?

by Shiva |
Kidnap: అబిడ్స్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఆచూకీ ఎక్కడ లభించిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర పరిధిలోని అబిడ్స్, కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కేసును అబిడ్స్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఐదు టీంలుగా వీడిపోయి నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌‌నర్వ గ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, అబిడ్స్‌లోని కట్టెల‌మండి‌లో చిన్నారి ప్రగతి ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో అటుగా వచ్చి ఓ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపించి పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. అయితే, కొద్దిసేపటి తరువాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అబిడ్స్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో పాప ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు 24 గంటల వ్యవధిలో కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని పాపను కాపాడారు. ఈ క్రమంలో బస్తీవాసులు, చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story