బెదిరిస్తారు.. దోచేస్తారు.. తస్మాత్ జాగ్రత! సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
బెదిరిస్తారు.. దోచేస్తారు.. తస్మాత్ జాగ్రత! సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నారు. వివిధ పద్దతుల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త రూట్‌ను వెతుకున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బెదిరిస్తారు.. దోచేస్తారు! తస్మాత్ జాగ్రత!! మీ పేరుతో ఉన్న పార్సిళ్ళు, కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయంటే బెదరకండి. పోలీసులమని కాల్స్ చేస్తే.. భయపడకుండా వెంటనే మీ స్థానిక పోలీసులను సంప్రదించండి’ అని ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవల కొరియర్ సర్వీస్ పేరుతో మోసాలు ఎక్కువగా పెరిగాయి. మాదాపూర్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి ముంబాయి కస్టమ్స్ అధికారినంటూ ఓ కేటుగాడు ఫోన్ చేశాడు. మీ ఆధార్ కార్డు ఇతర వివరాలున్న పార్సిల్ చైనా నుంచి వచ్చింది అందులో కొకైన్ ఉంది.. అని కేటుగాడు చెప్పాడు. దీంతో ఆమెను కేసు నుంచి తప్పిస్తానని మాయమాటలు చెప్పిన నేరగాడు ఒకే రోజు రూ. 19.5 లక్షలు కాజేశాడు.

Advertisement

Next Story

Most Viewed