మూడు వేర్వేరు చోట్ల భారీగా గంజాయి పట్టివేత

by Sridhar Babu |
మూడు వేర్వేరు చోట్ల భారీగా గంజాయి పట్టివేత
X

దిశ,కార్వాన్ : హైదరాబాద్, భద్రాచలం కొత్తగూడెం జిల్లాల్లో మూడు కేసుల్లో గంజాయిని పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమలాసన్ రెడ్డి తెలిపారు. దూల్పేట్ లోని మాచిపురాలో దినేష్ సింగ్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా అతని వద్ద 1.215 కేజీల గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శోభన్రావు, ఎండీ. సోహెల్ అనే వ్యక్తులు ఉన్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ దాడిలో సీఐ గోపాల్, ఎస్సై విష్ణు గౌడ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో...

భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా షేక్ యూసఫ్ అనే వ్యక్తి బైకుపై 4.11 కేజీల గంజాయిని తీసుకువెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బైక్ ను వెంబడించి గంజాయి సీజ్​ చేశారు.

కారులో తరలిస్తుండగా....

మరో కేసులో కొత్తగూడెంలో గంజాయిని కారులో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కారులో తీసుకెళ్తున్న 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక సెల్ ఫోను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో షేక్ యూసఫ్, సదా వెంకట దుర్గారావు, శ్రీహరి అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ తెలిపారు.

ఈ గంజాయిని సీలేరు నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేష్, భారీబాలు సుధీర్, వెంకట్, హరీష్, హనుమంతరావు, విజయ్, ఉపేందర్​ పాల్గొన్నారు. గంజాయి పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమల్ హాసన్ రెడ్డి, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed