- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Drug : మైలార్ దేవ్ పల్లి లో డ్రగ్స్ కలకలం
by Sridhar Babu |

X
దిశ, రాజేంద్రనగర్ : సర్కిల్ పరిధిలోని మైలార్దేవుపల్లి డివిజన్లో డ్రగ్స్ కలకలం రేగింది. 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను ఎస్వోటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడలోని ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబాయి కి చెందిన ఓ యువకుడితో పాటు మరో ముగ్గురు అరెస్టు చేశారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
- Tags
- Drug
Next Story