Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

by Ramesh N |
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఏ-1 ప్రభాకర్‌రావు, ఏ-6 శ్రవణ్‌రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే అతడిపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వ్యక్తగతంగానే ఆయన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఇంటర్‌పోల్ ద్వారా రప్పించే ప్రయత్నం

అమెరికాలో ప్రభాకర్‌రావు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, శ్రవణ్‌రావుపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసినా అతడి ఆచూకీ దొరకడం లేదు. దీంతో దర్యాప్తు అధికారులు విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed