- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసు: వెలుగులోకి కీలక నేతల పేర్లు.. సర్కార్ కీలక నిర్ణయం
దిశ, క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులను ఎంక్వయిరీ చేసిన పోలీసులు.. నెక్ట్స్ పొలిటీషియన్లను అరెస్టు చేసి విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రాధాకిషన్ రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేశారు. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా జైల్లో ఉన్నారు. వీరిని ప్రశ్నించిన క్రమంలోనే పలువురు కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చినట్టు దర్యాప్తు చేస్తున్న పోలీసు వర్గాల సమాచారం. స్టేట్‌మెంట్లలో వారు చెప్పిన అంశాలకు బలం చేకూర్చే కొన్ని వివరాలు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నట్టు తెలిసింది.
లక్కీ సిక్స్!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధమున్న ఈ రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడీ అవుతున్నది. ఆ లీడర్లు ఎవరనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేతలను కొద్దిమంది పోలీసులు ‘లక్కీ సిక్స్’ అని పిల్చుకుంటున్నారు. గతంలో ‘కీ రోల్’ పోషించిన ఇద్దరు మాజీ మంత్రులు, పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ, టాప్-ఫైవ్‌లో ఉన్న మరో నేతతో పాటు మాజీ ఐఏఎస్ కూడా పోలీసులు పేర్కొంటున్న ‘లక్కీ సిక్స్’ జాబితాలో ఉన్నట్టు సమాచారం. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వీరి పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నా.. నోటీసులు అందుకున్న తర్వాతనే ఆ నేతలు ఎవరనే క్లారిటీ రానున్నది.
త్వరలోనే నోటీసులు?
గతంలో ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్)లో అధికారులుగా పనిచేసినవారిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇప్పుడు వారందరి కస్టడీ పీరియడ్ ముగిసిపోవడంతో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. తదుపరి దర్యాప్తు ఏ దిశగా సాగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. వారి స్టేట్‌మెంట్‌లలో రికార్డు చేసిన అంశాల్లో పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉందని తేలడంతో వారికి కూడా నోటీసులిచ్చి ప్రశ్నించాలన్నది పోలీసుల ఆలోచన. ఫోన్ ట్యాపింగ్‌లో వారి ప్రమేయమేంటి?... ప్రతిపక్ష పార్టీల నేతల సంభాషణలపై ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది?... వారిని కట్టడి చేయాలని ఆర్డర్ ఇచ్చినవారెవరు?.. ఇలాంటివాటిని ఇప్పుడు పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు.
నిందితుల స్టేట్‌మెంట్లలో వెల్లడైన అంశాలే కాకుండా పోలీసులకు, డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు వచ్చాయి. అందులో బలవంతపు వసూళ్లు, కిడ్నాప్ చేయడం, షేర్లను బదిలీ చేసేలా ఒత్తిడి తేవడం, వాటిల్లో పోలీసులే పాలుపంచుకోవడం.. లాంటి విషయాలన్నీ ఉండడంతో దర్యాప్తుకు బలం చేకూరినట్లయింది. ఫోన్ ట్యాపింగ్‌లో ఎంత మంది ప్రత్యర్థుల్ని టార్గెట్ చేశారు?... ఎక్కడెక్కడ డెన్ (ట్యాపింగ్ చేసే సెంటర్లు)లు ఏర్పాటయ్యాయి?... వాటితో నేతలకు ప్రత్యక్షంగా ఉన్న సంబంధమేంటి?... స్థానికంగా రాజకీయంగా వారు ప్రత్యర్థులైనందుకేనా?... బలవంతపు వసూళ్లతో ప్రత్యక్షంగా పొందిన లబ్ధి?... సంభాషణలు విన్న తర్వాత చోటుచేసుకున్న మార్పులు?... పాల్గొన్న అధికారులకు లభించిన పదోన్నతులు... ఇలాంటి అంశాలన్నింటినీ పోలీసులు తదుపరి దర్యాప్తులో తేల్చనున్నారు.
ఎవరినీ వదిలిపెట్టం : హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతున్నదని, కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో గురువారం మాట్లాడిన ఆయన.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలనూ వెల్లడిస్తామని తెలిపారు. పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నా వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే గతంలో స్పష్టం చేశారు. నగర సీపీ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పలువురు రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి, కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పొలిటికల్ లీడర్ల ప్రమేయంపై తేల్చేందుకు పోలీసులు సిద్ధమవుతుండడం గమనార్హం.