చవితి రోజు తీవ్ర విషాదం.. ప్రాణం తీసిన విద్యుత్ బల్బ్

by sudharani |
చవితి రోజు తీవ్ర విషాదం.. ప్రాణం తీసిన విద్యుత్ బల్బ్
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ మండలంలో వినాయక చవితి రోజు తీవ్ర విషాదం జరిగింది. పండుగ ఉత్సహంలో ఉన్న యువకుడు వినాయక మండపంలో లైట్ బిగిస్తుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. సిర్సపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్సపల్లి గ్రామానికి చెందిన వంగ వెంకటేష్- లావణ్యలకు యశ్వంత్ ఏకైక కుమారుడు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపంలో బల్బు బిగిస్తుండగా బల్బు పగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి గమనించి యశ్వంత్‌ను వెంటనే హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే యశ్వంత్ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పండుగ రోజే ఈ సంఘటన జరగడంతో సిర్సపల్లి గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ గౌడ్ కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed