తీవ్ర వరద ఉధృతి.. కొట్టుకుపోయి వ్యక్తి మృతి

by Aamani |
తీవ్ర వరద ఉధృతి.. కొట్టుకుపోయి వ్యక్తి మృతి
X

దిశ,జహీరాబాద్ : న్యాల్కల్ మండలంలోని సవట వాగు వరద ఉధృతిలో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. న్యాల్ కల్ మండలంలోని అమీరాబాద్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్ (35) అనే వ్యక్తి ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యాడు. చాల్కి- చీకూర్తి గ్రామాల రోడ్డు మధ్యలో ప్రవహించే సవట వాగు పై ఉన్న చిన్నపాటి లోతట్టు వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదను గుర్తించక దాటేందుకు సాహసించడంతో ద్విచక్ర వాహనం తో సహా నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటన అమీరాబాద్ లో విషాద ఛాయలు నింపింది. రుక్మాపూర్ తండాలో గల ఓ సోలార్ ప్లాంట్ లో వాచ్ మెన్ విధులు నిర్వహించే మృతుడికి భార్య లక్ష్మి , 4 సంవత్సరాల వయస్సు గల కుమారుడు, 2సంవత్సరాల వయస్సు గల కూతురు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed