- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామరాజ్యం రాబోతోంది.. కొత్త భారత్ ఉద్భవించింది : ఆర్ఎస్ఎస్ చీఫ్
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపనతో కొత్త భారత్ ఉద్భవించిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇప్పుడు రామ్‌లల్లాతో పాటు భారత ప్రతిష్ఠ కూడా తిరిగొచ్చినట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ కచ్చితంగా ఉద్భవిస్తుందన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ్‌లల్లా కొలువుతీరడంపై మోహన్ భగవత్ హర్షం వెలిబుచ్చారు. ‘‘రామరాజ్యం రాబోతోంది. రాముడి సంకల్పం అందరికీ ఆదర్శం. ఇక నుంచి చిన్న చిన్న వివాదాలపై ఘర్షణలు పడటం ఆపాలి. రామాయణం, మహాభారతం కూడా ఇదే విషయాన్ని చెప్పాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా సోదరభావంతో మెలగడమే బ్రహ్మ సత్యమన్నారు. ‘‘రాముడి నుంచి కరుణ, పరోపకారం నేర్చుకోవాలి. అవసరమైనంత సంపద దగ్గర ఉంచుకొని .. మిగతాది సమాజ శ్రేయస్సు కోసం అందించాలి’’ అని పిలుపునిచ్చారు. అయోధ్య రామమందిరంలో జరిగిన మహత్తర ఘట్టాన్ని వర్ణించడానికి తనకు మాటలు రావడం లేదంటూ మోహన్ భగవత్ ఎమోషనల్ అయ్యారు. ‘‘ప్రధాని మోడీ చాలాకాలంగా నాకు తెలుసు. ఆయన గొప్ప తపస్వి. రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని కఠినమైన ఉపవాసదీక్ష కూడా చేపట్టారు’’ అని తెలిపారు.