ఆ చిలుక శాపం వల్లే సీతారాములు విడిపోవాల్సి వచ్చిందా?

by Sumithra |
ఆ చిలుక శాపం వల్లే సీతారాములు విడిపోవాల్సి వచ్చిందా?
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ్‌లాల్లాకు ఘనస్వాగతం పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే పురాణాల ప్రకారం రామాయణం అనేక భాషలలో రచించారు. అందులో విభిన్న కథలు రాశారు. ఈ కథల్లో ఒకటి సీత తన భర్త శ్రీరాముడి నుండి విడిపోయే అంశం. సీత తన భర్త నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే దాని గురించి ఈ కథలో తెలిపారు. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీతను చిలుక ఎందుకు శపించింది ?

పురాణాల ప్రకారం సీత తన బాల్యంలో తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకునేది. అకస్మాత్తుగా ఆమె దృష్టి చెట్టు పై కూర్చున్న చిలుకల జంట పైకి వెళ్ళింది. ఈ జంట సీతరాముడు గురించి తమలో తాము మాట్లాడుకోవడాన్ని సీతమ్మ తల్లి రహస్యంగా విన్నారట. శ్రీరాముడు గొప్ప రాజు అవుతాడు, జనక రాజు కుమార్తె యువరాణి సీతను వివాహం చేసుకుంటాడు. అన్న మాటలను విని సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయిందట. చిలుకల జంట వద్దకు వచ్చి నేను యువరాణి సీత మీకు నా భవిష్యత్తు ఎలా తెలుసు అని ప్రశ్నించిందట. అప్పుడు చిలుక వాల్మీకి మహర్షి ఆశ్రమంలోని చెట్టు పై తాను, అతని భార్య నివసించినట్లు చిలుక చెప్పిందట. ఈ విషయాలన్నీ వాల్మీకి మహర్షి తన శిష్యులకు చెప్పగా తాము వింటూ ఉండేవాళ్లమని అలా తమకు తెలిసిందని చిలుకలు చెప్పాయట.

తన భవిష్యత్తు గురించి మరింత తెలుసుకోవాలనే కోరికతో, సీతమ్మ తల్లి చిలుకలను తనతో పాటు తన మందిరంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందట. అప్పుడు అప్పుడు మగ చిలుక ఎగిరిపోగా ఆడ చిలుక సీతా మాతకు చిక్కిందని పురాణాలు చెబుతున్నాయి.

ఆడచిలుక ప్రస్తుతం గర్భవతిగా ఉందని దాన్ని రక్షించమని మగ చిలుక తల్లి సీతను ప్రార్థించింది. అప్పుడు సీత నిరాకరించడంతో మగ చిలుక సీతమ్మ తల్లికి శాపం పెట్టిందట. సీతామాత మీ వల్ల గర్భవతి అయిన నా భార్య నుండి నేను ఎలా విడిపోవాల్సి వచ్చిందో, అలాగే నీవు గర్భవతిగా ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి నుండి విడిపోతారు అంటూ చెప్పి మగ చిలుక తన ప్రాణాలను వదిలిందట. ఆ చిలుక శాపం కారణంగా, సీతాదేవి శ్రీరాముడి నుండి విడిపోవాల్సి వచ్చిందని పురాణాలు, పండితులు చెబుతున్నారు.

Advertisement

Next Story