ఉగ్రవాదుల హెచ్చరిక.. అయోధ్యలో హైఅలర్ట్

by GSrikanth |
ఉగ్రవాదుల హెచ్చరిక.. అయోధ్యలో హైఅలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం వేళ అల్లర్లు సృష్టిస్తామని ఉగ్రవాదుల నుంచి మరోసారి బెదిరింపులు రావడంతో భద్రతా సిబ్బంది అయోధ్యలో హైఅలర్ట్ విధించారు. బెదిరింపులకు పాల్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడుతామని యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ను చంపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశాడు. వరుస ఉగ్రమూకల హెచ్చరికలతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

Advertisement

Next Story