- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామచరిత్ మానస్, హనుమాన్ చాలీసా సేల్స్ జూమ్.. కారణమదే !
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం తేదీ(జనవరి 22) సమీపించింది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న గీతా ప్రెస్ ప్రచురించే రామచరిత్ మానస్, హనుమాన్ చాలీసా, సుందరకాండ గ్రంథాల విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో వాటి కోసం వస్తున్న ఆర్డర్లకు అనుగుణంగా సప్లై చేయలేకపోతున్నామని గీతా ప్రెస్ మేనేజర్ లాల్మణి తివారీ వెల్లడించారు. వినియోగదారులకు వెంటనే ఈ గ్రంథాలను అందించేలా ప్రింటింగ్‌ను వేగవంతం చేశామని చెప్పారు. కాగా, ఏదో ఒకరోజు ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం నిర్మితమవ్వాలనేది విధి నిర్ణయమని, ఈ ప్రక్రియలో తాను రథసారథిని మాత్రమేనని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఇటీవల అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన అద్వానీ.. ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరుకానున్నట్టు ‘విశ్వ హిందూ పరిషత్’(వీహెచ్‌పీ) తాజాగా స్పష్టం చేసింది. అవసరమైతే ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది.