అయోధ్య రాముడి పేరిట నాణెలు విడుదల

by GSrikanth |
అయోధ్య రాముడి పేరిట నాణెలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రాముడి పేరిట ముద్రించిన నాణెలు విడుదలయ్యాయి. ఈ నాణెలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం విడుదల చేశారు. నాణెలపై రామ్‌లల్లా, అయోధ్య ఆలయ చిహ్నాలను ముద్రించారు. కాగా, నెల 17వ తేదీన అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహాత్తర ఘట్టం పూర్తయింది. బాలరాముడి ప్రత్యేకంగా తయారు చేయించారు.

విగ్రహానికి పాలు, నీరు, గంధం, కుంకుమ ఎన్ని పూసినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా రూపొందించారు. అంతేకాదు వాటర్ ప్రూఫ్ కారణంగా ఈ విగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ విగ్రహం అంతే బలంగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఈ విగ్రహం భద్రంగా ఉంటుంది. ఈ బాల రాముని విగ్రహం తామరపువ్వుపై నిలబడి ఉంది. ఇది చిన్ననాటి రాముడు ఎలా ఉన్నాడో భక్తులకు తెలియజేస్తుంది. కర్నాటకకు చెందిన అరుణ్ యోగి రాజ్ అనే శిల్పి విగ్రహాన్ని రూపొందించారు.

Advertisement

Next Story