40 కెమెరాలు.. 250 మంది టీమ్.. 4కే‌లో రామమందిర ప్రారంభోత్సవం లైవ్

by Hajipasha |
40 కెమెరాలు.. 250 మంది టీమ్.. 4కే‌లో రామమందిర ప్రారంభోత్సవం లైవ్
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలోని నవ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని జనవరి 22న లైవ్‌లో టెలికాస్ట్ చేసేందుకు దూరదర్శన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆలయ సముదాయంతో పాటు ప్రాంగణంలో అన్నివైపులా దాదాపు 40 కెమెరాలను అమర్చనుంది. ‘‘ఇటీవల జరిగిన జీ20 సదస్సును దూరదర్శన్ 4కేలో ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్య ప్రోగ్రాంను కూడా 4కేలోనే ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రైవేట్ ఛానళ్లు కూడా దూరదర్శన్ ఫీడ్‌‌నే వాడుకుంటాయి’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. అయోధ్యలోని సరయూ ఘాట్ సమీపంలో ఉన్న రామ్ కీ పైది, కుబేర్ తిల వద్దనున్న జటాయు విగ్రహం వంటి ప్రదేశాలలో కూడా 40 కెమెరాలను అమర్చి సిద్ధంగా ఉంచుతామన్నారు. దూరదర్శన్‌కు చెందిన 250 మంది సిబ్బందితో కూడిన టీమ్ అయోధ్య నుంచి లైవ్ కవరేజీని అందించనుంది. జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed