New Car: అదిరే ఫీచర్లతో రూ.3లక్షలకే ఈవీ కారు.. ఓ లుక్కేయండి!

by Vennela |
New Car:  అదిరే ఫీచర్లతో రూ.3లక్షలకే ఈవీ కారు.. ఓ లుక్కేయండి!
X

దిశ,వెబ్‌డెస్క్: New Car: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. అన్ని దిగ్గజ సంస్థలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్లోకి సోలార్ కార్ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ప్రీ బుకింగ్స్ ను షురూ చేసింది. ఈ సోలార్ కారుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొదట్లో పెట్రోల్, డీజిల్ కార్లు ఆ తర్వాత సీఎన్జీ..ఇప్పుడు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో రూడ్లపై సోలార్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. కారును కనీసం ఛార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా కాస్త ఎండతగిలితే చాలు రయ్ రయ్ మని దూసుకుపోనున్నాయి. భారతదేశంలో తొలి సోలార్ కారు అందుబాటులోకి వచ్చింది. జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించిన ఆటోఎక్స్ పో2025లో ఈ సోలార్ కారును ప్రదర్శించారు. వేవ్ ఈవా (Vayve Eva) పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త కారు ఇంకా రోడ్లపైకి రాకముందే అందరిద్రుష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర కేవలం రూ. 3లక్షలు మాత్రమే ఉంది. ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదు.

అన్ని ఇతర కార్లలాగే ఇందులో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ప్రీ బుకింగ్స్ ను స్వీకరిస్తున్నారు. ఇక ఈ కారును నోవా, స్టెల్లా, వేగా అనే మూడు వేరియంట్స్ లో తీసుకువస్తున్నారు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

ఈ కారు బేస్ వేరియంగ్ అని చెప్పవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ. 3.24లక్షలు అని కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఫుల్ ఛార్జీ చేస్తే 125 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా దూసుకెళ్తుంది. ఇందులో ఎకో డ్రైవింగ్ మోడ్ ను ఇచ్చారు. ఈ సోలార్ కారు గంటకు గరిష్టంగా 60కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ కారులో 9కేడబ్ల్యూహెచ్ కెపాసిటి బ్యాటరీని అందించారు. హోమ్ ఛార్జర్ సహాయంతో కూడా బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ సిరీస్ లో వస్తున్న రెండో వేరియంట్ స్టెల్లా కూడా మంచి ఫీచర్లు అందిస్తున్నారు. ఈ కారు గరిష్టంగా గంటకు 60కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 175 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ టెక్నాలజీ ఆధారిత 12.6కేడబ్య్లూహెచ్ కెపాసిటి గల బ్యాటరీని అందించారు. ధర విషయానికి వస్తే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.25లక్షలుగా ఉంది.

ఇక టాప్ వేరియంట్ వేగా విషయానికొస్తే ఈ కారు గరిష్టంగా గంటకు 70కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. అలాగే బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 250కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక ఇందులో లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 18kWh కెపాసిటి గల బ్యాటరీని అందించారు.

Advertisement
Next Story

Most Viewed