Best mileage Bike: ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావచ్చు..బెస్ట్ మైలేజీ బైక్ ఇదే

by Vennela |   ( Updated:2025-04-01 07:10:27.0  )
Best mileage Bike: ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావచ్చు..బెస్ట్ మైలేజీ బైక్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: Best mileage Bike: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ హోండా షైన్ .​ ​హోండా షైన్ సిరీస్‌లో రెండు మోడళ్లను ఉన్నాయి. ఒకటి షైన్ 100, రెండవది షైన్ 125. ఈ రెండు బైక్‌లు భారత మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి. మీరు బడ్జెట్ బైక్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే హోండా షైన్ 100 బైక్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు .​​​​​​​​​ ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ . 66,900.​ హీరో స్ప్లెండర్ ప్లస్ కు గట్టి పోటీని ఇవ్వడానికి ఈ బైక్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మైలేజ్ పరంగానూ ఈ బైక్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ARAI ప్రకారం, హోండా షైన్ 100 లీటరుకు 55 కి.మీ మైలేజీని అందిస్తుంది. అయితే ఈ బైక్ 9 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉంది. ఇప్పుడు మీరు ఒకేసారి ట్యాంక్ నింపితే 55X9 = 585 కి.మీ మైలేజ్ పొందుతారు. అంటే మీరు ట్యాంక్ ఫుల్ పెట్రోల్ కొట్టించుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి మళ్లీ తిరిగి హైదరాబాద్ రావచ్చు. ఇది రోజువారీ ఉపయోగం కోసం ఒక బడ్జెట్ బైక్ అని చెప్పవచ్చు. ఈ బైక్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

హోండా షైన్ 100 లో 98.98 సిసి , 4 స్ట్రోక్ , SI ఇంజన్ తో వస్తుంది. ఇది 7.28 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది . ఈ ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చి ఉంటుంది . ఇంజిన్ స్మూత్ గా ఉండి మంచి మైలేజీని అందిస్తుంది. స్ప్లెండర్‌లో ఇచ్చిన ఇంజిన్ కూడా దాదాపు అదే శక్తిని ఉత్పత్తి చేస్తుంది .​​​​ ఇది రోజువారీ ఉపయోగం కోసం ఇది బెస్ట్ బైక్.

హోండా షైన్ 100 డిజైన్‌ను చాలా అద్భుతంగా ఉంది. కానీ గ్రాఫిక్స్ సహాయంతో ఇది కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది .​​​​​​ షైన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఆకర్షించినంతగా యువతను ఆకట్టుకోదు.​​​​​​​ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో , హోండా షైన్ 100.. 99 కిలోల బరువున్న ఏకైక బైక్ ఇదే. స్ప్లెండర్ ప్లస్ 112 కిలోల బరువు ఉంటుంది .​ తక్కువ బరువు కారణంగా , భారీ ట్రాఫిక్‌లో కూడా షైన్‌ను సులభంగా నడపవచ్చు. ఈ బైక్ మెయింటనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. హోండా షైన్ 100 డిజైన్ చాలా బెసిక్ గా ఉంటుంది. ఇందులో చాలా పాత స్టైల్ గ్రాఫిక్స్ ఉన్నాయి. దీనికి ఫ్రంట్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ సౌకర్యం ఉంది. ఈ బైక్ కి ఇప్పుడు డిస్క్ బ్రేక్ లు ఉంటాయి. ఇది ఖచ్చితంగా హీరో స్ప్లెండర్ ప్లస్‌తో పోటీపడుతుంది కానీ షైన్ ఈ బైక్‌తో పోటీ పడలేదు.

Next Story

Most Viewed