చైనాకు షాక్ ఇచ్చిన కెనెడా.. 100% పన్ను కట్టాల్సిందే!

by M.Rajitha |
చైనాకు షాక్ ఇచ్చిన కెనెడా.. 100% పన్ను కట్టాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా నుండి తమ దేశానికి ఎగుమతి అవుతున్న కార్లపై ఆ దేశం 100% పన్ను కట్టాల్సిందే అంటోంది కెనెడా. చైనాలో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లపై కెనెడా ఈ నిర్ణయం తీసుకుంది. చైనాలో తయారవుతున్న ఎలక్ట్రిక్ కార్లపై ఎంత మేరకు టాక్స్ విధించాలి అనే విషయం మీద గత నెల రోజులుగా చేసిన చర్చల అనంతరం.. సోమవారం కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ప్రకటన జారీ చేశారు. అలాగే చైనా నుండి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం మీద కూడా 25% టాక్స్ విధించాలని నిర్ణయించింది. కాగా కొద్ది రోజుల క్రితమే అమెరికా, యూరప్ కమిషన్స్ చైనా తయారు చేసే ఈవీ కార్లపై అధికంగా పన్ను వేస్తామని ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలోకి కెనెడా కూడా చేరింది. ప్రస్తుతం చైనాలో తయారవుతున్న టెస్లా కార్లు తప్ప మిగతా ఏవీ కెనెడాలో దిగుమతులు, విక్రయాలు జరగడం లేదు. అమెరికా, యూరప్ కమిషన్ల ప్రకటన మీద స్పందించిన చైనా.. గ్రీన్ ఎకానమీని ప్రోత్సహించేందుకే తాము అతి తక్కువ ధరకు ఈవీ కార్ల అమ్మకాలు జరుపుతున్నట్టు తెలిపింది. ఈవీ కార్లను చైనా కేవలం 12 వేల డాలర్లకే అంతర్జాతీయ విపణిలో అమ్ముతోంది.

Advertisement

Next Story

Most Viewed