- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉబర్ ఆటో బుక్ చేశారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

దిశ, వెబ్ డెస్క్: క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబెర్ (Uber) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ సంస్థ రైడింగ్ సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో ఉబర్ సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోలు బుక్ చేసుకున్న కస్టమర్లు రైడ్ ముగిశాక క్యాష్ నేరుగా ఆటో డ్రైవర్‌కే పేమెంట్లు చేయాలని పేర్కొంది. అంటే ఇకపై ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్ ఏ మాత్రం జోక్యం చేసుకోదు. 'సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్' విధానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా ఉబర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే ట్రిప్‌కు కమీషన్ కాకుండా ప్లాట్‌ఫామ్ వాడుకోవడానికి డ్రైవర్లు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఓలా, ర్యాపిడో ఇప్పటికే కమీషన్ ఆధారంగా కాకుండా సాఫ్ట్‌వేర్‌ను సర్వీసుగా అందించడం ప్రారంభించాయి.
ఇకపై తమ సంస్థ కేవలం రైడర్లకు కనెక్ట్ చేసే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లా మాత్రమే వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. అంటే మీరు ఉబర్‌లో ఆటో బుక్ చేసినప్పుడు సమీపంలోని డ్రైవర్లతో అనుసంధానం చేస్తుంది. బుక్ అయ్యాక పేమెంట్స్ నేరుగా ఆటో డ్రైవర్‌కి చెల్లించాల్సి ఉంటుంది. ఉబర్ క్రెడిట్స్, ఉబర్‌కు సంబంధించిర ఇతర ప్రమోషనల్ ఆఫర్లేవీ ఈ రైడ్లకు వర్తించవు. అలాగే, క్యాన్సిలేషన్లకు సంబంధించి ఎలాంటి ఛార్జీలూ విధించబోమని ఉబర్ తెలిపింది. అంతేకాదు, ఆటోల నుంచి ఇకపై ఎలాంటి కమీషన్ కూడా వసూలు చేయబోమని పేర్కొంది. రైడ్ బుకింగ్ సమయంలో ఉబర్ ఫేర్‌ను సూచిస్తుంది. అలాగని అదే ఫైనల్ రేటు కాదని.. ఆటో డ్రైవర్, ప్రయాణికుల పరస్పర అవగాహనతో తుది మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అంటే ఇకపై ఆటో డ్రైవర్లు పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఉబర్ తెలిపింది.