ఏపీలో 9,536 కరోనా కేసులు

by  |
ఏపీలో 9,536 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,233మందికి పరీక్షలు నిర్వహించగా 9,536మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,67,123 చేరింది. 66మంది చనిపోవడంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,912గా ఉంది. ప్రస్తుతం 95,072 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4,67,139మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 10,131మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,99,826 శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి అనంతపురం జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కడప, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు చనిపోయారు

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,414 కరోనా కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరిలో 1,076, చిత్తూరులో 957, నెల్లూరులో 844, గుంటూరులో 792, ప్రకాశంలో 788, శ్రీకాకుళంలో 733, కడపలో 585, విజయనగరంలో 573, అనంతపురంలో 521 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed