90శాతం మంది వయోజనులు టీకాకు అర్హులు!

by vinod kumar |
90శాతం మంది వయోజనులు టీకాకు అర్హులు!
X

వాషింగ్టన్: కరోనాతో అధికంగా నష్టపోయిన అమెరికా మహమ్మారిపై పోరును ఉధృతం చేసింది. మే నెలలో టీకా వేసుకోవడానికి అందరినీ అర్హులుగా ప్రకటిస్తామని చెప్పిన యూఎస్ ప్రభుత్వం, ఒక అడుగు ముందుకేసి అంతకు ముందే కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 19 లోగా దేశంలోని 90శాతం మంది వయోజనులను టీకాకు అర్హులుగా ఉంటారని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. టీకా కేంద్రాలనూ పెంచుతున్నామని, ప్రతి అమెరికా పౌరుడి నివాసానికి గరిష్టంగా ఐదు మైళ్లలో ఒక టీకా కేంద్రం ఉంటుందని వివరించారు.

మాస్క్ మ్యాండేటరీ కాదని కొందరు గవర్నర్‌లు నిబంధనలు సడలించడాన్ని ప్రెసిడెంట్ బైడెన్ తప్పుబట్టారు. కరోనాపై పోరు ముగియలేదని, అలసత్వం వహిస్తే ఇన్నాళ్ల పోరాటానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనాపై అమెరికా తీవ్రంగా పోరాడుతున్నదని, ఈ పోరాటాన్ని మరికొంత కాలం కొనసాగించాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed