- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెడ్డపేరు వీళ్లతోనే.. పని కోసం వచ్చినోళ్లను..
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగస్తులు.. కానీ చేసేది మాత్రం తలదించుకునే పనులు. పని కోసం వచ్చే ప్రతి వారి దగ్గర నుంచి వారికి డబ్బులు అందాల్సిందే. లేదంటే చెప్పులు అరిగేలా తిరిగినా పని అవ్వదు. ఈ తతంగం జిల్లా స్థాయి అధికారుల నుంచి మొదలుకుని కింది స్థాయి అధికారుల వరకు కొనసాగుతోంది. ఆరు నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో 9 మంది అధికారులు ఏసీబీకి చిక్కారంటే ముడుపుల కార్యక్రమం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి జిల్లాలో కొందరు అధికారుల వల్ల ఆ శాఖలకు చెడ్డపేరు వస్తోంది. పని చేయలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే పని జరగదు. గడిచిన ఆరు నెలల కాలంలో జిల్లాలో 9మంది అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంటో ఇట్టే అర్థమవుతోంది. పట్టుబడ్డ 9 మందిలో నలుగురు రెవెన్యూ శాఖకు చెందిన వారు కాగా, ఇద్దరు ఎక్సైజ్ శాఖ, ఒక్కరు వైద్య ఆరోగ్య శాఖ, ఒకరు కార్మిక శాఖ, మరొకరు ఆహార కల్తీ నియంత్రణ శాఖకు చెందిన అధికారుల ఉన్నారు. ఇలా శాఖలతో సంబంధం లేకుండా అన్ని శాఖల అధికారులు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కారు. వీరిలో జిల్లా స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఉండడం గమనార్హం. వీరి నుంచి సుమారు రూ.లక్షా 40 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరి కొంత మంది అధికారులపై ఏసీబీ నిఘా ఉన్నట్టు సమాచారం.
శాఖలు, హోదాలతో సంబంధం లేకుండా..
ఏసీబీకి పట్టుబడిన వారిలో తమ హోదాలతో, శాఖలతో సంబంధం లేకుండా ముడుపులు అందుకున్న వారున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి వైధ్యాధికారి మొదలుకుని కింది స్థాయి సిబ్బంది సైతం ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీఎంఅండ్ హెచ్ఓ.భీంనాయక్ వడ్డేపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ మంజులను రిలీవ్ చేసేందుకు రూ.7వేలు లంచం తీసుకుంటూ జూలై 23న అధికారులకు పట్టుబడ్డారు. ఒక జిల్లా స్థాయి అధికారి ఇలా రూ.7వేలు లంచం తీసుకుంటూ పట్టుబ డడంపై అందరూ ముక్కున వేలువేసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శా ఖలో పనిచేస్తున్న మహ్మద్ వజీద్ అనే ఉద్యోగి ఫుడ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం వచ్చిన భానుప్రకాష్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఫిబ్రవరి 17న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన వెంకట్రాం నాయక్ అనే వ్యక్తి 2018లో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు అతని కారును జప్తు చేసి అరెస్టు చేశారు. దీనిని రిలీజ్ చేసేందుకు అచ్చంపేట ఎక్సైజ్ సీ.ఐ.శ్రావణ్ కుమార్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ దేవేందర్ ఈ ఏడాది మర్చి 16న రూ.9వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ఇద్దరు ఉపాధి హామీ కూలీలు వివాహ ప్రోత్సాహక నగదు కోసం కార్మిక శాఖలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నగదును ఇచ్చేందుకు కార్మిక శాఖ లేబర్ అసిస్టెంట్ కోటేశ్వర్‌రావు ఒక్కొక్కరి నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా జులై 7న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రెవెన్యూ శాఖకు చెందిన వారే నలుగురు
జిల్లాలో మొదటి నుంచి రెవెన్యూ శాఖ అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఆరు నెలల్లో ఏసీబీ అధికారులు పట్టుకున్న 9 మందిలో నలుగురు రెవెన్యూ శాఖకు చెందిన వారే ఉన్నారంటే ఆ శాఖలో అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మారెపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి తన కొనుగోలు చేసిన 2.25 ఎకరాల భూమిని మ్యూటేషన్ కోసం డిప్యూటీ తహసీల్దార్ ఏకంగా రూ.లక్ష లంచంగా డిమాండ్ చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటుండగా ఫిబ్రవరి 24న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దుప్పట్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటప్ప అనే వ్యక్తి 5.14 ఎకరాల భూమి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకోగా అతని నుంచి ఆ గ్రామ వీఆర్వో పద్మనాభం రూ.8వేలు లంచం తీసుకుంటూ మార్చి 6న ఏసీబీ అధికారులకు చిక్కాడు. వీరితో పాటు మద్దూరు మండలానికి చెందిన ఒక వీఆర్వో సైతం పట్టుబడ్డాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సుగూరు గ్రామానికి చెందిన ఆందజనేయులు భూమి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అతని దగ్గర నుంచి వీఆర్వో వెంకటరమణ రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. రెవెన్యూ శాఖలో చాలా మంది లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో ఈ శాఖపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు.
ప్రభుత్వ డబ్బుతో మరిన్ని వెలుగులోకి..
గతంలో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసే బాధితులకు ఏసీబీ అధికారులే డబ్బులు ఇచ్చేవారు. ఇవే డబ్బులను బాధితులు సదరు అధికారికి ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు వారిని పట్టుకుని నగదును తిరిగి శాఖ ఖాతాలో జమ చేసేవారు. కానీ ప్రస్తుతం బాధితులే నేరుగా డబ్బులు సదరు అధికారులకు చెల్లించాలి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకునే నగదును బాధితులకు ఇవ్వడానికి కొంత సమయం తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు బదిలీ కావడంతో బాధితుల డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులకు డబ్బుల విషయంలో సహకరిస్తే మరికొన్ని అవినీతి తిమింగలాలను బయటకు లాగొచ్చు.